బ్రహ్మంగారి మఠం వివాదంలో ట్విస్ట్.. ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన.. రెండో భార్య

by  |
brahmamgari matam controversy
X

దిశ, ఏపీ బ్యూరో : కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదం మళ్లీ మొదటికొచ్చింది. మఠం పీఠాధిపత్యంపై దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనను బలవంతంగా రాజీకి ఒప్పించారంటూ ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. మరోవైపు బలవంతంగా రాజీ కుదర్చలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇంతలో మహాలక్ష్మమ్మ మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను రాజీపై ఎలాంటి పిటిషన్ వేయలేదని తమకు ఎలాంటి న్యాయం జరుగుతుంది. భవిష్యత్ లో తమ పరిస్థితి ఏంటి అనేదానిపైనే కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. మెుత్తం ఈ వ్యవహారం ఒకే రోజు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో చర్చనీయాంశంగా మారింది.

అసలు ఏం జరిగిందంటే!

ఇటీవలే బ్రహ్మంగారి మఠం వివాదం ఓ కొలిక్కి వచ్చింది. దివంగత పీఠాధిపతి మెుదటి భార్య పెద్దకుమారుడు వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా నియమితులయ్యారు. అందుకు ఇరు కుటుంబాలు అంగీకారానికి వచ్చాయి. ఒక ఒప్పందం పత్రాలను సైతం రాసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అయితే దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మమ్మ హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. పెద్దమనుషుల రాజీ చర్చల్లో తమకు న్యాయం జరుగుతుందా అనే అంశంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి కామెంట్స్…

మహాలక్ష్మమ్మ హైకోర్టును ఆశ్రయించడంపట్ల మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్పందించారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో దాదాపు 5 రోజులు సందిగ్దత కొనసాగిందని..దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజలు మధ్య వారి కుటుంబంతో చర్చలు జరిపినట్లు తెలిపారు. పీఠాధిపతి ఎన్నిక విషయంలో ఇరు కుటుంబాలు పరస్పర అంగీకారంతో మొదటి భార్య పెద్ద కుమారుడిని పీఠాధిపతిగా నిర్ణయించినట్లు తెలిపారు. ఏకాభిప్రాయం రావడానికి అందరం కృషి చేశామని ఇలాంటి తరుణంలో మహాలక్ష్మమ్మ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసిందన్నారు. హైకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలనుసారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ట్విస్ట్ ఏంటంటే..

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనకు సోదరుడు లాంటి వారని దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మమ్మ అన్నారు. తమ కుటుంబానికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించినట్లు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేరు చేర్చి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తన భర్త రాసిన వీలునామా చెల్లుతుందా.. మా కుటుంబ సభ్యుల మధ్య రాసుకున్న ఒప్పందం చెల్లుతుందా… దేవాదాయ శాఖ ద్వారా నా బిడ్డలకు న్యాయం జరిపించాలని మాత్రమే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. రు భవిష్యత్తులో పీఠాధిపతి కోసం తగువులు జరగకుండా న్యాయస్థానం తీర్పు పొందాలని ఉద్దేశంతో శాశ్వత పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బ్రహ్మంగారి భక్తులు గ్రామస్తులు సహృదయంతో అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నట్లు మహాలక్షమ్మ ఆ వీడియోలో పేర్కొన్నారు. మెుత్తానికి సద్దుమణిగిపోయింది అనుకున్న మఠం వివాదం హైకోర్టు వరకు వెళ్లడంతో ధర్మాసనం ఎలాంటి తీర్పునిస్తుంది…ప్రస్తుత నూతన పీఠాధిపతి ఎంపిక చెల్లుతుంందా అన్న చర్చ మెుదలైంది.


Next Story

Most Viewed