మహిళా దినోత్సవం రోజే.. మాతృత్వానికి మచ్చ

by  |
మహిళా దినోత్సవం రోజే.. మాతృత్వానికి మచ్చ
X

దిశ, మహబూబ్ నగర్: ఒక వైపు ప్రపంచం మొత్తం మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే మరో వైపు ఒక మాతృమూర్తి మాతృత్వానికి మచ్చ తీసుకువచ్చింది. గుర్తు తెలియని మహిళ రెండువారాల వయసున్న ఆడపిల్లను నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళ్లింది. ఆసుపత్రి సిబ్బంది అంత ఎవరి పనిలో వారు ఉండగా ఉన్నటుండి ఆసుపత్రిలో పసిపాప ఏడుపు శబ్దం వినిపించింది. దీంతో సిబ్బంది మొత్తం అప్రమత్తమై పరిశీలించగా పసిపాపను గుర్తించారు. పాప తల్లీ కోసం ఆరాతీయగా వివరాలు తెలియలేదు. పరిసరాలను గమనించినా ఎవరూ కనపడకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం అందించారు. మహిళా దినోత్సవం రోజున ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పలువురిని కలిచివేసింది.

Tags: mother, child, road, Women’s Day, nagar kurnool, mahabubnagar, icds, kalwakurthy hospital

Next Story

Most Viewed