వెంటపడి దాడి చేసిన చిరుత.. తిరుమల ఘాట్‌ రోడ్‌లో హల్‌చల్

by srinivas |
leopard attack motorists
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల ఘాట్ రోడ్‌లో చిరుతపులి హల్‌చల్ చేసింది. తిరుమల ఎగువ కనుమదారిలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు నీటి సరఫరా విభాగ ఉద్యోగులపై వెంటపడి చేసింది. వినాయక స్వామి ఆలయం దాటిన తరువాత.. మలుపులో చిరుత ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపై దూకింది. ఈ ఘటనలో చిరుత గోళ్లు గీరుకుని ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో భయాందోళన చెందిన వాహనదారులు ఆపకుండా వేగంగా ముందుకెళ్లడంతో చిరుత మళ్లీ అడవిలోకి వెళ్లింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

leopard attack motorists



Next Story

Most Viewed