చేపల వేటకు వెళితే కరెంట్ షాక్.. చివరకు..

by  |
చేపల వేటకు వెళితే కరెంట్ షాక్.. చివరకు..
X

దిశ నేరేడుచర్ల: విద్యుత్ వైర్ల సహాయంతో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన పాలకవీడు మండలంలోని గుండ్లపహడ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన పోలకట్ల వెంకయ్య(42) సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెరువులో విద్యుత్ వైర్ల సహాయంతో చేపలు పట్టే క్రమంలో షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య సునీత ఫిర్యాదు మేరకు పాలకవీడు మండల ఇన్చార్జీ ఏ.ఎస్సై సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed