సార్ నా గేదె పాలు ఇవ్వట్లేదు.. పోలీసులను ఆశ్రయించిన రైతు.. చివరికి

by  |
సార్ నా గేదె పాలు ఇవ్వట్లేదు.. పోలీసులను ఆశ్రయించిన రైతు.. చివరికి
X

దిశ, వెబ్‌డెస్క్ : అప్పుడప్పుడు కొన్ని వింత ఘటనలు చోటు చేసుకుంటాయి. అలానే మధ్యప్రదేశ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. తన గేదె పాలు ఇవ్వట్లేదని ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఓ రైతు. రైతు ఫిర్యాదు‌తో పోలీసులదంరూ షాక్‌లో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్లితే.. బింద్‌ జిల్లాలోని బాబూ లాల్‌ జాతవ్‌ అనే రైతు నాయ్‌గావ్‌ పోలీస్‌స్టేషన్‌లో తన గేదె కొన్ని రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా తన గేదె కొన్ని రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదని, గ్రామంలో ఎవరో చేతబడి చేయడం వల్లనే గేదె పాలు ఇవ్వట్లేదు, కనీ‌సం పాలు కూడా పితకనివ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సార్ నాగేదె పాలు ఇవ్వట్లేదు.. అంటూ లికితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన పోలీసులు కంప్లైంట్ తీసుకుని, అతడికి నచ్చజెప్పి పశు వైద్యుడి దగ్గరకు పంపారు. గేదెకు వైద్యం చేయిచడంతో మరుసటి రోజే గేదె పాలిచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు రైతు. అయితే ఈ ఫిర్యాదు పై పోలీసులు స్పందిస్తూ ఇలాంటి ఫిర్యాదులు రావడం సహజమే గతంలో కూడా ఇలానే ఓ వ్యక్తి తన దూడ కనిపిచడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంటూ తెలిపారు. ఏదేమైనా ఇలా గేదె పాలు ఇవ్వడం లేదని గేదెతో సహా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed