అమ్మకానికి ‘గాలి’..తెలుసా?

by  |
అమ్మకానికి ‘గాలి’..తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగం కోసమే కాకుండా, చదువుకోవడానికి ఎంతో మంది తమ సొంత ఊరిని వదిలి వేరే రాష్ట్రాలకు, నగరాలకు, పట్టణాలకు వెళుతుంటారు. అయితే సెలవుల్లో మన గ్రామానికి తిరిగి వస్తుంటే మనసంతా ఆనందంగా ఉంటుంది. బస్సు దిగి..కాలు కింద పెట్టగానే..పైరగాలి మెల్లగా మనల్ని తడుముతుంది. ఆ క్షణం..ఊపిరి మళ్లీ లేచివచ్చినట్లు అనిపిస్తుంది. తనువంతా సంతోషంతో పులకరించి పోతుంది. మన ఊరి గాలి, మట్టి వాసనతో మనకున్న అనుబంధమది. యూకేకు చెందిన మై బ్యాగేజ్ అనే కంపెనీ కూడా ఆ సంతోషాన్నిచ్చే ప్రయత్నం చేస్తోంది. తమ తమ దేశాల గాలిని సీసాల్లో అమ్ముతూ ఎమోషనల్ మెమోరీలను గుర్తుచేస్తోంది.

యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన మై బ్యాగేజ్ కంపెనీ ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్‌లాండ్, వేల్స్‌లకు చెందిన ‘ఫ్రెష్ ఎయిర్’‌‌ను బాటిల్స్‌లో అమ్ముతోంది. ఎంతోమంది కస్టమర్లు వీటిని కొనుగోలు చేసేందుకు ముందస్తు ఆర్డర్లు పెట్టుకోవడం గమనార్హం. 500 ఎంఎల్ గాలి కలిగిన ఒక బాటిల్ ధర రూ.2,500గా నిర్ణయించారు. స్వచ్ఛమైన గాలి అవసరమైనప్పుడు లేదా తమ హోమ్‌సిటీ గుర్తుకు వచ్చినప్పుడు సీసా మూత తీసి పీల్చుకుని, ఆ తర్వాత మళ్లీ అవసరమైనపుడు వినియోగించుకుంటే, ఒక్కో సీసాను కొన్ని వారాల పాటు ఉపయోగించుకోవచ్చని తయారీదారులు పేర్కొంటున్నారు.

‘నేను యూఎస్ వెళ్లిన తర్వాత మా పేరెంట్స్ నా కోసం స్కాటిష్ ఎయిర్‌ బాటిల్‌ను యూఎస్‌కు పంపించారు. ఈ గాలిని పీల్చుతుంటే, నాకు మా హోమ్ సిటీలోనే ఉన్నా ఫీలింగ్ కలుగుతుంది’ అని రేచల్ అనే స్కాట్లాండ్ సిటిజన్ రివ్యూలో పేర్కొంది. ఇలా విదేశాలకు వెళ్లిన ఎంతోమంది తమ దేశానికి (యూకే) చెందిన ఎయిర్ బాటిల్స్‌ను ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇలా గాలిని అమ్మడం కొత్త కాదు. ఓ కంపెనీ ‘న్యూజిలాండ్ గాలి’ని గతంలో 500 ఎం‌ఎల్ గాలిని రూ.1,800కు అమ్మింది. రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన గాలిని కొనుక్కునే స్థితికి కూడా మనం దగ్గర్లోనే ఉన్నాం.



Next Story

Most Viewed