ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ముగియనున్న మొదటి దశ ఎన్నికల ప్రచారం

by Disha Web Desk 12 |
ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ముగియనున్న మొదటి దశ ఎన్నికల ప్రచారం
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 లోక్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ మొదటి దశలో అత్యధికంగా తమిళనాడులోని 39 పార్లమెంట్ స్థానాలకు అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ మరియు నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో మొత్తం 102 స్థానాలకు మొదటి దశలో ఈ నెల 19 ఎన్నికల ఓటింగ్ జరగనుంది. దీంతో ప్రధాన పార్టీలు తమ, తమ ప్రచారంలో మునిగిపోయాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పైన పేర్కొన్న 102 నియోజకవర్గాల్లో మైకులు మూగపోనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా ఓటింగ్ కు పూర్తి ఏర్పాటు చేశారు.


Next Story

Most Viewed