అధికారులు, నాయకులు అనే తేడా లేకుండా అన్నీ చెక్ చేస్తున్నాం

by Disha Web Desk 2 |
అధికారులు, నాయకులు అనే తేడా లేకుండా అన్నీ చెక్ చేస్తున్నాం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్నికల నియమావళిపై మీడియాతో మాట్లాడారు. పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా ప్రతీ వాహనాన్నీ తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఓవరాల్‌గా నగరంలో జరిపిన తనిఖీల్లో రూ.16 కోట్ల నగదును సీజ్ చేసినట్లు వెల్లడించారు. రూ.3.77 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాకుండా రూ.3.50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో రూ.43 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఆధారాలు చూపిన తర్వాత రూ.11 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. మిగతా రూ.32 కోట్ల నగదు ఇంకా సీజ్‌లోనే ఉందని వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతోంది. ఈ సారి పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కాగా, ఈ నెల 18 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.


Next Story