శ్రీరామనవమి ఉత్సవాలను అడ్డుకునేందుకు కుట్ర.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
శ్రీరామనవమి ఉత్సవాలను అడ్డుకునేందుకు కుట్ర.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామనవమి ఉత్సవాలపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పశ్చిమబెంగాల్‌లో ప్రధాని పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. శ్రీరామనవమి ఉత్సవాలను అడ్డుకునేందుకు టీఎమ్‌సీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కీలక ఆరోపణలు చేశారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. అయినా ఎవరూ ఆందోళన చెందవద్దని.. శ్రీరామనవమి వేడుకలకు కోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించబోతోందని అన్నారు.

ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని దేశం మొత్తం నినదిస్తోందని చెప్పారు. ప్రపంచ సంక్షోభాల మధ్య భారతదేశాన్ని బలోపేతం చేయడానికి ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. భారతదేశాన్ని శక్తివంతంగా, సంపన్నంగా మార్చేందుకు బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రపంచ పరిస్థితులను మనం గమనిస్తూనే ఉన్నాం.. చుట్టూ యుద్ధం, అజ్ఞానం, అనిశ్చితి, భయాందోళన వాతావరణం నెలకొని ఉంది.. అలాంటి ప్రపంచానికి బలమైన, శక్తిమంతమైన భారతదేశం చాలా అవసరం.. అందుకే బీజేపీ దేశానికి సేవ చేయడంలో నిమగ్నమై ఉంది. బలహీనులు ఓటు వేస్తే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.


Next Story

Most Viewed