Cinema Politics : వైసీపీలో చేరిన ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఆ నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్..!

by Disha Web Desk |
Cinema Politics : వైసీపీలో చేరిన ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఆ నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. పల్లె, పట్నం తిరుగుతూ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తు్న్నాయి. ఇక టికెట్ రాని నేతలు మరో పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఇలా నేతలే కాకుండా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు సైతం పార్టీల కండువాలు మార్చుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే టాలీవుడ్ అగ్రహీరోల ఫ్యాన్స్ సైతం ఈ ఎన్నికల్లో పార్టీలు మారుతున్నట్లు ప్రకటిస్తున్నారు.

తాజాగా ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ తాము వైఎస్ఆర్ సీపీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. అందేకాదు.. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి చిన్నియాదవ్ ఆధ్వర్యంలో 200 మంది అభిమానులు మంత్రి అమర్‌నాథ్ నివాసంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమ మద్దతు సీఎం జగన్‌కు ఇస్తున్నామని ప్రకటించారు. అమర్‌నాథ్ ఆధ్వర్యంలో గాజువాక అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, అల్లు అర్జున్ అధికారికంగా ప్రకటించకపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఉంటారనేది అందరికీ తెలిసిందే. అటు ప్రభాస్ పెద్దనాన్న, సీనియర్ హీరో దివంగత కృష్ణంరాజు బీజేపీలో కీలక పదవులు అనుభవించారు. కానీ ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం తన అభిమాన హీరోలను కాదని వైసీపీలో చేరడం గాజువాకలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో గాజువాక నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయానికి కూతవేటు దూరంలో ఆగిపోయారు. ఈసారి టీడీపీ, జనసేన పార్టీల పొత్తు కారణంగా ఆ సీటును టీడీపీకి కేటాయించడంతో స్థానికంగా వ్యతిరేకత మూటకట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గాజువాకను వదిలేసి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ తారల అభిమానులు వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధికారికంగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed