- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తీహార్ జైల్లోనే కవిత నెక్ట్స్ బతుకమ్మ పండుగ.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైందని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మంగళవారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌తో పాటు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని కూడా జైలుకు పంపుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే బతుకమ్మ పండుగను ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లోనే జరుపుకోబోతోందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే కాకుండా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోము అని హెచ్చరించారు. ఇకపై జగదీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకపోతే రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
బీఆర్ఎస్ అంటేనే అలీబాబా దొంగల ముఠా అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరు మీద ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేసిందని అన్నారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో చామలకిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ప్రాంతంలో ఉండగా ఇక్కడ ఏ పార్టీ ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారని భరోసా ఇచ్చారు. నాణ్యమైన ప్రాజెక్టులు కడతాం కానీ.. బీఆర్ఎస్ నేతల్లాగా కూలిపోయే ప్రాజెక్టులను తాము కట్టబోమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడమే నా లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.