కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది: ధర్మపురి అర్వింద్

by Disha Web Desk 2 |
కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది: ధర్మపురి అర్వింద్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. మంగళవారం అర్వింద్ ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ఎమ్ఐఎమ్‌తో కలిసి సింపతి గేమ్ ప్లే చేస్తోందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దేశ ప్రజలంతా మోడీ వైపే ఉన్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం అయిందని విమర్శించారు. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎమ్ఐఎమ్‌తో కలిసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

ఎన్నికల కోసమే కాంగ్రెస్ పసుపు రైతులను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయశాఖ మంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమన్నారు. పసుపు విస్తీర్ణం తగ్గిందని మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు పసుపు పంటపై అవగాహన లేదని విమర్శించారు. పసుపు బోర్డుపై కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మానుకుని.. రైతులకు మేలు చేసే పనులు చేయాలని సూచించారు. నిజామాబాద్‌ను రానున్న రోజుల్లో పసుపు ఎగుమతుల హబ్‌గా మారుస్తామని అరవింద్ ప్రకటించారు.


Next Story