IPL 2023: ఆర్సీబీలోకి అతడి ప్లేస్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్..

by Vinod kumar |
IPL 2023: ఆర్సీబీలోకి అతడి ప్లేస్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్..
X

బెంగళూరు: ఐపీఎల్-16కు దూరమైన రీస్ టాప్లే, రజత్ పటిదార్ స్థానాలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు భర్తీ చేసింది. రీస్ టాప్లే స్థానంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వేన్ పార్నెల్‌లను జట్టులోకి తీసుకోగా.. పటిదార్ స్థానాన్ని కర్ణాటకకు చెందిన వైశాఖ్ విజయ్‌ కుమార్‌‌తో భర్తీ చేసింది. సౌతాఫ్రికా తరఫున పార్నెల్ 56 టీ20ల్లో ఆడగా.. 59 వికెట్లు తీశాడు. అలాగే, 2011లోనే ఐపీఎల్‌ ఎంట్రీ ఇచ్చిన అతను 26 మ్యాచ్‌ల్లో 7.35 ఎకానమీతో 26 వికెట్లు పడగొట్టాడు. గతేడాది వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ రీస్ టాప్లేను రూ. 1.90 కోట్లకు దక్కించుకోగా అతని స్థానంలో వచ్చిన పార్నెల్‌‌తో రూ. 75 లక్షలతో ఒప్పందం చేసుకుంది.

అలాగే, దేశవాళీలో కర్ణాటక జట్టు తరఫున 14 టీ20 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసిన వైశాఖ్‌ను రూ. 20 లక్షలకు తీసుకుంది. కాగా, ఆటగాళ్ల గాయాల కారణంగా బెంగళూరు తీవ్రంగా నష్టపోయింది. విల్ జాక్స్, రీస్ టాప్లే, రజత్ పటిదార్ గాయాల కారణంగానే లీగ్‌ నుంచి తప్పుకోగా.. పేసర్ జోష్ హాజెల్‌వుడ్ పాల్గొనడంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. లీగ్‌లో తొలి మ్యాచ్‌తోనే ముంబైపై బోణీ కొట్టిన ఆర్సీబీ.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ నెల 10న బెంగళూరు వేదికగా లక్నోతో తలపడనున్నది.

Next Story

Most Viewed