ఐపీఎల్‌లో రోహిత్ నయా రికార్డు.. ధోనీ, విరాట్ సరసన నిలిచిన హిట్‌ మ్యాన్

by Dishanational3 |
ఐపీఎల్‌లో రోహిత్ నయా రికార్డు.. ధోనీ, విరాట్ సరసన నిలిచిన హిట్‌ మ్యాన్
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ తప్పించడం తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ముంబైకి ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్‌‌ను పక్కనపెట్టడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కొత్త సారథి హార్దిక్ పాండ్యాను దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఈ విషయం పక్కనపెడితే రోహిత్ బుధవారం స్పెషల్ మ్యాచ్ ఆడేందుకు మైదానంలో అడుగుపెట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌ ముంబై ఇండియన్స్ తరపున అతనికి 200వ మ్యాచ్.

ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ బెంగళూరు తరపున 239 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. ఎం.ఎస్ ధోనీ చెన్నయ్ తరపున 221 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. 2008లో దక్కన్ చార్జర్స్ తరపున రోహిత్ ఐపీఎల్ అరంగేట్ర చేశాడు. 2011 నుంచి అతను ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. 2013 సీజన్ మధ్యలో అతను జట్టు పగ్గాలు అందుకున్నాడు. రోహిత్ సారథ్యంలో ముంబై ఐదుసార్లు(2013, 2015, 2017, 2019, 2020) చాంపియన్‌గా నిలిచింది. మొత్తంగా ముంబై తరపున రోహిత్ 199 మ్యాచ్‌ల్లో 5,084 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతోపాటు 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మకు ఆ జట్టు ఐకాన్ సచిన్ టెండూల్కర్ స్పెషల్ జెర్సీని అందించాడు.


Next Story

Most Viewed