RCB Vs KKR: కట్టుదిట్టంగా ఆర్సీబీ బౌలింగ్.. పీకల్లోతు కష్టాల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్

by Disha Web Desk 1 |
RCB Vs KKR: కట్టుదిట్టంగా ఆర్సీబీ బౌలింగ్.. పీకల్లోతు కష్టాల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024‌లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడబోతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచున్నాడు. కాగా, గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా ఆర్సీబీ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యా్క్స్‌వెల్ దూరమయ్యారు. ఇప్పటికే పాయింట్ల పట్టిలో అట్టడుగున్న ఉన్న జట్టును పై వరుసలోకి తీసుకురావాలనే కాంక్షతో ఆర్సీబీ, కోల్‌కతాతో పోరుకు సిద్ధమైంది.

ఈ క్రమంలోనే బ్యాటింగ్‌ను ఆరంభించిన కేకేఆర్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (48; 14 బంతుల్లో 4x7, 6x3) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగు పెట్టించాడు. ఈ క్రమంలోనే అతడు మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక చివరి మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన మరో ఓపెనర్ సునీల్ నరైన్ కేవలం 10 పరుగులు చేసి యష్ దయాల్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రఘువంశీ కేవలం 3 పరుగులు చేసి అదే యష్ దయాల్ బౌలింగ్ క్యాచ్ అవుట్ అయ్యాడు.

మరో బ్యాటింగ్ సంచలనం వెంకటేశ్ అయ్యర్ 8 బంతుల్లో 16 పరుగులు చేసిన కాసేపు తన బ్యాటింగ్‌తో అలరించి కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి రింకూ సింగ్ చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ తరుణంలో రింకూ సింగ్ 16 బంతుల్లో 24 పరుగు చేసిన లూకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో పెవిలియన్ బాటపట్టాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ 13 ఓవర్లు ముగిసేసరికి 137 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిపోయింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ 22 బంతుల్లో 29 పరుగులు, ఆండ్రీ రస్సెన్ పరుగులు ఏమీ చేయకుండా క్రీజ్‌లో ఉన్నారు.



Next Story

Most Viewed