RCB Vs KKR: చివర్లో రెచ్చిపోయిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్లు.. బెంగళూరు విజయలక్ష్యం ఎంతంటే?

by Disha Web Desk 1 |
RCB Vs KKR: చివర్లో రెచ్చిపోయిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్లు.. బెంగళూరు విజయలక్ష్యం ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024‌లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచున్నాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌ను ఆరంభించిన కేకేఆర్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (48; 14 బంతుల్లో 4x7, 6x3) ధాటిగా ఆడుతూ.. బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జట్టులో కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ 36 బంతుల్లో 50 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

అదేవిధంగా చివర్లో వచ్చిన రింకూ సింగ్ 16 బంతుల్లో 24, ఆండ్రీ రస్సెల్ 20 బంతుల్లో 27, రమణ్‌దీప్ సింగ్ 9 బంతుల్లో 24 పరుగులు చేయడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు చేశారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. యష్ దయాళ్ 4 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చిన 2 వికెట్లను తీసుకున్నాడు. ఇక కామెరూన్ గ్రీన్ 4 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చిన 2 వికెట్లను నేలకూల్చాడు. 223 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ ఓపెనర్లు ఇన్సింగ్స్‌ను ధాటిగానే ఆరంభించారు. 2 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 27 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 6 బంతుల్లో 18 పరుగులు, డూప్లెసిస్ 4 బంతుల్లో 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.



Next Story

Most Viewed