ఆర్సీబీ పని కతం.. ప్లేఆఫ్స్ ఆశలు నిర్జీవం

by Disha Web Desk 12 |
ఆర్సీబీ పని కతం.. ప్లేఆఫ్స్ ఆశలు నిర్జీవం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ అన్ని సీజన్లలో ఆర్సీబీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ప్లేయర్లు అందరూ ఈ జట్టులో ఆడినవారే. అలాగే భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ జట్టు ప్రారంభం నుంచి అందులోనే కొనసాగుతున్నారు. రెండు సార్లు ఫైనల్ వెళ్లిన ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ కొట్టాలనే కల కలగానే మారిపోయింది. ఈ క్రమంలోనే 2024 లో అయిన ఆర్సీబీ కప్పు కొడుతుందని ఆ జట్టు అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. కానీ ఆ జట్టు వరుస ఓటములు వారి ఆశలు గల్లంతు చేస్తున్నాయి.

తాజాగా సోమవారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడంతో ఆ జట్టు ప్లే ఆఫ్ చేసుకునే ఆశలు గల్లంతయ్యాయి. ప్లేఆఫ్ చేరే జట్టుల పొజిషన్‌లో ఆర్సీబీకి 0 పర్సంటేజ్ దక్కింది. ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడిన ఆర్సీబీ జట్టు కేవలం ఒకటే విజయం సాధించి 2024 పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దీంతో ఆర్సీబీ జట్టు ఈ సీజన్ ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లు అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే ఇలా జరగాలి..

ప్లేఆఫ్స్ ఆశలను క్లిష్టతరం చేసుకున్న ఆర్సీబీ టైటిల్ రేసులో ఉండాలంటే.. తర్వాత ఆడబోయే మ్యాచ్‌లో మిరాకిల్స్ జరగాల్సి ఉంది. ఈ సీజన్ లో ఆర్సీబీకి మరో 7 మ్యాచులు ఉండగా అందులో అన్నింట్లో తప్పక విజయం సాధించాల్సి ఉంది. విజయాలతో పాటు నెట్ రన్ రేట్ కూడా ఎంతో అవసరం. ఆర్సీబీ వరుస విజయాలతో పాటు పాయింట్ల పట్టికలో టాప్ 3 లో ఉన్న జట్లు అలానే కొనసాగి.. మిగిలిన స్థానాల్లో ఉన్న జట్లు ఓడిపోతూ రావాల్సి ఉంటుంది. అలా అయితేనే ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంటుంది.


Next Story