- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గుజరాత్ను ఓడించిన గుజరాతీ.. ఆయనపై నెట్టింట్ల వైరల్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023 కప్ ను చెన్నయ్ సూపర్ కింగ్స్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఎంతో నాటకీయంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో సీఎస్కే మట్టి కరిపించింది. దీంతో దేశవ్యాప్తంగా సీఎస్కేపై, ఆ జట్టు కెప్టెన్ ధోనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే చివరి రెండు బాల్స్ లో 10 రన్స్ చేసి సీఎస్కే కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన రవీంద్ర జడేజాను కూడా ప్రతి ఒక్కరూ ఆకాశానికెత్తుతున్నారు. మ్యాచ్ గుజరాత్ వైపు వెళ్లిపోయిన టైంలో సిక్స్ , ఫోర్ కొట్టి చెన్నయ్ ని గెలిపించిన తీరు అద్భుతం అంటూ జడ్డూను పొగుడుతున్నారు సీఎస్కే ఫ్యాన్స్. ‘‘గుజరాత్ ను ఓడించిన గుజరాతీ’’ అంటూ మరికొంతమంది జడేజాను కొనియాడుతున్నారు.
కాగా రవీంద్ర జడేజా సొంత రాష్ట్రం గుజరాత్ అనే విషయం తెలిసిందే. ఇక ఆయన భార్య రివాబా జడేజా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. ఇక వర్షం వల్ల డక్వర్త్ లూయిస్ విధానం వల్ల 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. అనుకున్న టార్గెట్ ను సాధించి ఐదో సారి టైటిల్ ను చేజిక్కించుకుంది. ఇక థండరస్ విక్టరీ తర్వాత జడేజా మాట్లాడుతూ.. ధోని కోసమే జట్టులోని ప్రతి సభ్యుడు కష్టపడి ఆడారని చెప్పాడు. ధోని వల్ల అదంతా సాధ్యమైందని పేర్కొన్నాడు.