గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆ తప్పు చేసిన శాంసన్.. షాకిచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు

by Dishanational3 |
గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆ తప్పు చేసిన శాంసన్.. షాకిచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు
X

దిశ, స్పోర్ట్స్ : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు భారీ జరిమానా పడింది. బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ తమ బౌలింగ్ కోటాను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ శాంసన్‌కు ఐపీఎల్ నిర్వాహకులు రూ. 12 లక్షలు జరిమానా విధించారు. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ నిబంధనను రాజస్థాన్ ఉల్లంఘించడం ఇదే తొలిసారి. మరోసారి పునరావృతమైతే కెప్టెన్‌తోపాటు జట్టు మొత్తానికి ఫైన్ పడనుంది.

ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ నిబంధన కారణంగా జరిమానా ఎదుర్కొన్న మూడో కెప్టెన్ శాంసన్. ఇంతకుముందు పంత్‌కు రెండుసార్లు, గిల్‌‌కు ఓ సారి జరిమానా పడింది. గుజరాత్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 197 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో ఈ సీజన్‌లో ఆ జట్టు తొలి పరాజయాన్ని పొందింది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఒక ఓటమితో రాజస్థాన్ పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నది. ఈ నెల 13న తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.



Next Story