టీ20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ ఉగ్రవాదుల హెచ్చరికలు.. పాక్ బోర్డుకు కష్టాలు..!

by Disha Web Desk 12 |
టీ20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ ఉగ్రవాదుల హెచ్చరికలు.. పాక్ బోర్డుకు కష్టాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన కొద్దిరోజులకే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సారి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఈ ప్రపంచప్‌కు ఆతిధ్యం అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఓ ఉగ్రవాద సంస్థ టీ20 ప్రపంచకప్ ను జరగనివ్వమని.. పాకిస్తాన్ నుంచి హెచ్చరించారు. దీంతో టీ20 ప్రపంచ కప్ నిర్వహణకు ఉగ్రవాదలు భయం పట్టుకుంది. కాగా దీనిపై ఐసీసీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు స్పందించింది. జూన్ 12 నుంచి జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని.. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత కి ప్రణాళికలు రూపొందించామని స్థానిక ప్రభుత్వాల సపోర్ట్ ఉందని.. మ్యాచుల నిర్వహణకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని.. హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల హెచ్చరికలు రావడంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. వచ్చే సంవత్సరంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలని చూస్తున్న క్రమంలో తాజా పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్‌కు అవకాశం ఇవ్వడం కష్టమేనని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed