కోహీర్ హత్య కేసులో ఇద్దరు నిందితులు రిమాండ్

by Disha Web Desk 15 |
కోహీర్ హత్య కేసులో ఇద్దరు నిందితులు రిమాండ్
X

దిశ, జహీరాబాద్ : కోహీర్ మర్డర్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. రిమాండ్ చేసిన వారిలో ముస్థఖీమ్ (22), మహమ్మద్ కైఫ్(24) ఉన్నారు. జహీరాబాద్ టౌన్ సీఐ రాజబోయిన రవి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ లోని ఎల్లమ్మ బండ , హానిసింగ్ గ్రామ నివాసి షేక్ అన్వర్ అలీ(30)తో నిందితులకు స్నేహం ఏర్పడింది. నిందితుల్లో ఒకరు కోహీర్ మండల కేంద్రమైన నల్సావాడిలో నివాసముంటున్న రాజనెల్లికు చెందిన ముస్థఖీమ్​ ఆటో డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా మరో నిందితుడు మండలంలోని గురుజవాడకు చెందిన మహమ్మద్ కైఫ్ కూడా ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.

హత్యకు గురైన షేక్ అన్వర్ అలీ నిందితులిద్దరితో ఉన్న స్నేహం కొద్దీ డబ్బులు ఇచ్చి పుచ్చుకునేవారు. కొంతకాలం తర్వాత వీరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు బెడిసి కొట్టడంతో కోహీర్ హైస్కూల్ పాత బిల్డింగ్ వెనుకాల దావత్ చేసుకున్న అనంతరం షేక్ అన్వర్ అలీని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమాచారం అందిన వెంటనే డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి, హతుని మేనమామ రషీద్ ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణయ్య గౌడ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం వీరిని జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డిపల్లి బీసీ(బి) హాస్టల్ దగ్గర అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోహీర్ ఎస్ఐ కృష్ణయ్య గౌడ్, హెచ్సీ విఠల్, పీసీలు శ్రీనివాస్, సుధాకర్ , శివరాం పాల్గొన్నారు.



Next Story

Most Viewed