అలిగేరు బ్రిడ్జి పై నుంచి దూకి వ్యక్తి మృతి

by Aamani |
అలిగేరు బ్రిడ్జి పై నుంచి దూకి వ్యక్తి మృతి
X

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లో ఇల్లందు కు వెళ్లే ప్రధాన రహదారి పై ఉన్న అలిగేరు బ్రిడ్జి పై నుండి బొలగాని రమేష్ (28) దూకి బలవన్మరణం చెందినట్లు ఎస్ఐ ఉపేందర్ సోమవారం తెలిపారు.ఆదివారం ఎస్ఐ తన డ్యూటీ లో భాగంగా బయ్యారం నుంచి గంధంపల్లికి వెళ్లుచుండగా బ్రిడ్జిపై టు వీలర్ వాహనం స్టాటింగ్ ఉండి దాని పక్కనే చెప్పులు, మొబైల్ ఫోన్ ఉండటాన్ని గమనించినట్లు తెలిపారు‌.తిరుగు ప్రయాణంలో అదే ప్రాంతంలో టు వీలర్ వాహనం గమనించి విచారణ చేయగా బయ్యారం మండల కేంద్రంలో బొలగాని రమేష్ వాహనం గుర్తించారు. ఆదివారం సాయంత్రం 7 గంటలు కావడంతో వాగులో వెతకటం సాధ్యం కాకపోవడంతో, సోమవారం గాజు ఈతగాళ్లతో వాగులో వెతకగా మృతుడి మృతదేహం గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed