గంధసిరిలో యువకుడి దారుణ హత్య

by Disha Web Desk 15 |
గంధసిరిలో యువకుడి దారుణ హత్య
X

దిశ, ముదిగొండ : మండల పరిధిలోని గంధసిరి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి హత్య జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన షేక్ షరీఫ్ (26) అనే యువకుడి పై అదే గ్రామానికి చెందిన ఇద్దరు దుండగులు దాడి చేయగా షరీఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గత రెండు సంవత్సరాలుగా హైదరాబాదులో ఉంటుండగా రెండు రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. షరీఫ్ కి మరో యువకుడితో వాగ్వాదమే హత్యకు దారి తీసినట్లు సమాచారం. షరీఫ్ చనిపోయిన విషయం గ్రామస్తులు గమనించి వెంటనే పోలీస్ లకి

సమాచారం ఇవ్వగా వెంటనే ఎస్సై జి.నరేష్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం దుండగులను పోలీస్ స్టేషన్ కి తరలించారు. రెండు సంవత్సరాలుగా హైదరాబాదులో ఉంటూ రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన యువకుడు ఓ మహిళ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదంతో హత్యకు దారి తీసినట్లుగా గ్రామస్తులు తెలిపారు. మృతుడి జననేంద్రియాలపై మోకాలితో గుద్ది హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి షరీఫ్ మృతదేహాన్ని తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జి. నరేష్ తెలిపారు.



Next Story

Most Viewed