తల్లిని హత్య చేసిన మైనర్ బాలుడు: కర్ణాటకలో దారుణం

by samatah |
తల్లిని హత్య చేసిన మైనర్ బాలుడు: కర్ణాటకలో దారుణం
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 17 ఏళ్ల మైనర్ బాలుడు టిపిన్ పెట్టలేదనే కారణంతో తన తల్లిని హత్య చేశాడు. కేఆర్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోలార్ జిల్లా ముల్ బాగల్ పట్టణానికి చెందిన నేత్ర(40) స్థానిక పార్కులో పనిచేస్తోంది. అతని కుమారుడు ఓ ప్రయివేటు కళాశాలలో డిప్లమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గురువారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన బాలుడు భోజనం చేయకుండా నిద్రపోయాడు. అయితే ఆహారాన్ని వృధా చేసినందుకు బాలుడిని తల్లి మందలించింది. అంతేగాక రాత్రి భోజనం చేయకపోవడంతో పొద్దున్నే టిఫిన్ చేయడానికి నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే క్షణికావేశానికి గురైన బాలుడు ఇనుప రాడ్‌తో తల్లి తలపై బలంగా కొట్టగా..అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం బాలుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed