అయోధ్యలో ఇక కాల్పులు, కర్ఫ్యూలు ఉండవు: యోగీ ఆధిత్యనాథ్

by Dishanational2 |
అయోధ్యలో ఇక కాల్పులు, కర్ఫ్యూలు ఉండవు: యోగీ ఆధిత్యనాథ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రామమందిర ప్రారంభోత్సవం తర్వాత యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో ఇక కాల్పులు, కర్ఫ్యూలు ఉండబోవని తేల్చి చెప్పారు. 500 ఏళ్ల నాటి భారతీయుల కల నేరవేరిందని తెలిపారు. ఒక ప్రధాన సమాజం తమ దేవుడికి సరైన స్థానం కల్పించడానికి ఇంత కాలం కష్టపడాల్సి రావడం చరిత్రలో తొలిసారి అని చెప్పారు. రామమందిరం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. ‘ప్రతి ఒక్కరూ ఉద్వేగభరితంగా, సంతోషంగా ఉన్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట వేళ దేశంలోని ప్రతి నగరం, గ్రామం అయోధ్యగా మారిపోయింది. ప్రతి మార్గం రామజన్మభూమి వైపే పయనిస్తున్నట్టు కనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేత మోడీ అని కొనియాడారు.

Next Story

Most Viewed