నాలుగు రాష్ట్రాల్లో ప్రతీరోజు ఐదు వేలకు పైగా కేసులు

by  |
నాలుగు రాష్ట్రాల్లో ప్రతీరోజు ఐదు వేలకు పైగా కేసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 9.37 లక్షలున్నాయి. గత పది రోజులుగా ఈ కేసుల సంఖ్య పది లక్షలకు చేరుకోకుండా కొనసాగుతూ ఉంది. మొత్తం కేసుల్లో సుమారు 86% రికవరీ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటికీ ప్రతీ రోజు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొత్తగా ఐదు వేల కంటే ఎక్కువ చొప్పున పాజిటివ్ కసులు నమోదవుతూ ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా సుమారు 76 వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా 82 వేల మంది డిశ్చార్జి అయ్యారు. చాలా రోజుల తర్వాత కరోనా మృతుల సంఖ్య వెయ్యికి లోపే నమోదైంది. సెప్టెంబరు మాసంలో ఒక్క రోజు మినహా ప్రతీరోజు వెయ్యికి పైగానే కరోనా మరణాలు సంభవిస్తూ ఉంటే ఆదివారం మాత్రం 940 మంది మాత్రమే కరోనా కారణంగా చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1.02 లక్షలకు చేరువగా ఉంది. మొత్తం కరోనా మృతుల్లో ఎక్కువగా మహారాష్ట్రలో ఉండగా మొత్తం ఏడు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య ఐదు వేల మార్కుకంటే ఎక్కువగానే ఉంది.



Next Story