‘86శాతం మంది పేషెంట్లకు కరోనా లక్షణాలే కనిపించలేదు’

by  |
‘86శాతం మంది పేషెంట్లకు కరోనా లక్షణాలే కనిపించలేదు’
X

చెన్నై: తమిళనాడులో దాదాపు 86శాతం కరోనా పేషెంట్లలో అసలు ఆ వైరస్ లక్షణాలే కనిపించలేదని రాష్ట్ర సీఎం పళనిస్వామి తెలిపారు. లాక్‌డౌన్, ఇతర ఆంక్షలు ఈ మహమ్మారికి చెక్ పెట్టాయని వివరించారు. ఫిబ్రవరి నుంచి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. తమ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలతో రాష్ట్రంలో కరోనా మరణాలు స్వల్పంగా ఉన్నాయని, అలాగే రికవరీ రేటు ఆశాజనకంగా ఉన్నదని తెలిపారు. జూన్ 4వ తేదీ నాటికి 5.50 లక్షల కరోనా టెస్టులను నిర్వహించామని వెల్లడించారు. 86శాతం మంది కరోనా బాధితుల్లో ఆ వైరస్ లక్షణాలే కనిపించలేదని ఈ టెస్టుల ద్వారానే వెలుగులోకి వచ్చిందని వివరించారు. తమిళనాడులో 30,152 కేసులు నమోదవ్వగా, 251 మంది మరణించారు. సుమారు 16వేల మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు.



Next Story

Most Viewed