బయటపడ్డ వెండి నాణేలు..ఎక్కడంటే

by  |
బయటపడ్డ వెండి నాణేలు..ఎక్కడంటే
X

దిశ,మహబూబ్ నగర్
పురాతన కాలం నాటి వెండి నాణేలు బయట పడ్డాయి. ఓ రైతు తన తోటలో పనులు చేస్తుండగా ముద్రణలతో కూడిన నాణేలు కనిపించాయి.ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో సోమవారం వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే.. ముకురాల గ్రామంలోని కాశన్న అనే రైతు తన మామిడి తోటలో పనులు చేస్తున్నాడు. నేల చదును చేస్తున్న సమయంలో అనుకోకుండా 74 వెండి నాణేలు బయటపడ్డాయి. అనంతరం రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందడంతో స్థానిక తహశీల్దార్, ఎస్సై అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించారు. మరికొన్ని నాణేలు లభ్యమయ్యే అవకాశం ఉండటంతో ఆ స్థలంలోనే అధికారులు జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు. కాగా, ఆ నాణేలు ఏ కాలం నాటివి, అక్కడికి ఎలా వచ్చాయనే దానిపై వివరాలు ఇంకా తెలియరాలేదు.

Next Story

Most Viewed