కండ్లకూ కావాలి వ్యాయమం..

by  |
కండ్లకూ కావాలి వ్యాయమం..
X

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అలాంటి కళ్లను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మన కళ్లకు ఎలాంటి హాని జరిగినా.. అది మన దైనందిన జీవితంపై తీవ్రప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అర్ధరాత్రిళ్ల వరకూ ఫోన్లు చూసే వారికి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు రోజులో ఓ 10నిమిషాలు కళ్ల కోసం సమయం కేటాయించి చిన్నపాటి వ్యాయమం చేస్తే.. కంటి సమస్యలు రాకుండా నివారించవచ్చు. సులభమైన ఆసనాలతో కంటిచూపును మరింత మెరుగుపరచుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

ముందుగా విశ్రాంతస్థితిలో కూర్చోవాలి. అనంతరం రెండు కళ్లను పెద్దవిగా చేసి, తల కదిలించకుండా కను గుడ్లను మాత్రమే కుడి నుంచి ఎడమకు.. ఎడమ నుంచి కుడికి.. అలాగే, పై నుంచి కిందకు.. కింద నుంచి పైకి మెల్లగా తిప్పూతూ ఉండాలి. తర్వాత కనుగుడ్లను కంటిలోపలి చివరంచుల వరకూ తీసుకెళ్తూ.. తిప్పాలి. మళ్లీ వ్యతిరేక దిశలో తిప్పాలి. ఇలా 10నుంచి 20సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల కంటిలోని రక్తనాళాలు ఉత్తేజమవుతాయి. ఫలితంగా రక్తప్రసరణ మెరుగవుతుంది.

అలాగే, రెండు అరచేతులను బాగా రుద్ది, వేడెక్కిన తరవాత వాటిని మూసిన ఉన్న మీ రెండు కళ్లపై ఉంచాలి. ఆ వేడిని కళ్లు శోషించుకునేంత వరకూ చేతులు అలానే ఉంచాలి. కళ్లు అలానే మూసి ఉంచి, దీనినే మూడు సార్లు రిపీట్ చేయాలి. ఇలా రోజూ చేస్తే కళ్లు అలసిపోకుండా ఉంటాయి. కళ్ల మంట తగ్గుతుంది.

పాలకూరతో ప్రయోజనాలు..!

Next Story

Most Viewed