జడ్చర్లలో 480 ఇండ్ల నిర్మాణం

by  |
జడ్చర్లలో 480 ఇండ్ల నిర్మాణం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో రూ. 26 కోట్లతో చేపడుతున్న 480 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా నిరహిస్తున్నామని పేర్కొన్నారు. జడ్చర్ల లో పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణము చెపడుతున్నామని, జడ్చర్ల రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి ఇండిపెండెంట్ ఇండ్లు ఇస్తామన్నారు. ఎక్కడ లేని విధంగా గ్రామ స్థాయిలో జడ్చర్లలో ఇండ్ల నిర్మాణము జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత్ నాటక అకాడెమీ చైర్మన్ శివ కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వాల్యా నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed