2026 నాటికి 35 కోట్ల 5జీ చందాదారులు

by  |
2026 నాటికి 35 కోట్ల 5జీ చందాదారులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 5జీ కనెక్షన్లు 350 కోట్లుగా అంచనా వేయబడ్డాయి. అదేవిధంగా 2026 నాటికి భారత్‌లో 35 కోట్ల సబ్‌స్క్రిప్షన్స్ నమోదవుతాయని టెలికాం సంస్థ ఎరిక్సన్ తన నివేదికలో పేర్కొంది. 2021 ప్రారంభంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం జరిగితే, భారత్ అంతటా 5జీ కనెక్షన్ లభిస్తుందని ఎరిక్సన్ నెట్‌వర్క్ సొల్యూషన్స్ హెడ్ నితిన్ బన్సాల్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభాలో 15 శాతానికిపైగా ప్రజలు 5జీ పరిధిలో నివసించనున్నారని సోమవారం విడుదలైన ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్-2020 నివేదిక అభిప్రాయపడింది.

2026 నాటికి ప్రపంచ జనాభాలో 60 శాతం మందికి 5జీ కవరేజీ లభిస్తుంది. అలాగే, 5జీ సబ్‌స్క్రిప్షన్లు 350 కోట్లకు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. భారత్‌లో 5జీ సబ్‌స్క్రిప్షన్లు 35 కోట్లను దాటేస్తాయని, 2026లో మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్లలో 26 శాతం వాటానుకు 5జీ నెట్‌వర్క్ కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. నివేదిక అంచనా ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు నెలకు 15.7 జీబీ సగటుతో అత్యధిక ట్రాఫిక్‌ను భారత్ కలిగి ఉంది.

మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ సేవలకు తక్కువ ధర ఉండటం, సరసమైన ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ప్రజలు గడిపే సమయం వంటి అంశాలు భారత్‌లో నెలవారీ వినియోగ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. దీని ప్రకారం..2026లో మొత్తం ట్రాఫిక్ నాలుగు రెట్లు పెరుగుతుందని, నెలకు సగటు ఇంటర్నెట్ వినియోగం 35 జీబీకి చేరుకుంటుందని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ఎడిటర్ వెల్లడించారు.

Next Story

Most Viewed