బ్లాక్‌ మార్కెట్లో రెమిడెసివర్ ఇంజెక్షన్లు.. ముగ్గురి అరెస్టు

by  |
బ్లాక్‌ మార్కెట్లో రెమిడెసివర్ ఇంజెక్షన్లు.. ముగ్గురి అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. ఒక్కరోజు వ్యవధిలనే 6వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే, రాష్ట్రంలో కొవిడ్ టీకాలు అందుబాటులో లేవు. ఈ విషయమై సంబంధిత వైద్య అధికారులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జగన్ కేంద్రంతో సంప్రదించి వీలైనంత త్వరగా కొవిడ్ వ్యాక్సిన్ రాష్ట్రానికి రప్పించాలని ఆదేశించారు. ఇదిలాఉండగా కొందరు అక్రమార్కులు రెమిడెసివర్ టీకాలను బ్లాక్ మార్కెట్లో గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నారు.

ఈ బ్లాక్ దందా గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలో శుక్రవారం వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ బ్లాక్ మార్కెట్‌ను డ్రగ్ ఇన్ స్పెక్టర్ ఛేదించారు. గుట్టుగా ఇంజెక్షన్లు అమ్ముకుంటున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెమిడెసివర్ ఇంజెక్షన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తూ.. రెమిడెసివర్ ఇంజెక్షన్లను దొంగిలించి బ్లాక్‌లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Next Story

Most Viewed