ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

by  |
ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. అయితే అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణ స్వీకారంతో పాటు, కరోనా వ్యాక్సినేషన్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం రూ.160 పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, విజయవాడలలో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.49,960 ఉండగా అదే 22 క్యారెట్ల 10గ్రాముల బంగార ధర రూ.45,800కు చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.52,260 ఉండగా అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110పెరిగి రూ.47,910కి చేరింది.
బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీ పెరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో వెండి ధర రూ.700 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.66,500కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.600 మేర పుంజుకుంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.71,300కు చేరింది.



Next Story

Most Viewed