ICC ప్రపంచ కప్ 2023.. సెమీ-ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న వేధికలు ఇవే

by Disha Web Desk 12 |
ICC ప్రపంచ కప్ 2023.. సెమీ-ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న వేధికలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: ICC ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. కాగా దీనికి సంబంధించిన షెడ్యూల్ క్వాలిఫైయర్ మ్యాచులపై ఆధారపడి ఉంది. అయితే క్వాలీఫయర్ మ్యాచ్‌లు పూర్తి కావోస్తుండటంతో నేడు పూర్తీ షేడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే మరో వార్తను ఐసీసీ ప్రకటించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం మరియు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ - రెండూ దిగ్గజ వేదికలు - 2023 ప్రపంచ కప్‌లో రెండు సెమీ-ఫైనల్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందున్నాయి.

అయితే అంతకు ముందు చెన్నై ఈ పోటీలో ఉన్నప్పటికి షేడ్యూల్ తేదిల సమయాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియాలు 2023 సెమీ ఫైనల్ మ్యాచులకు అతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ ఏడాది ప్రపంచకప్‌లో 10 జట్లు పాల్గొంటాయి. ఆతిథ్య దేశంగా, 2020-2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా వంటి భారత్ నేరుగా అర్హత సాధించింది. కాగా మరో రెండు జట్లు క్వాలిఫైయర్ మ్యాచుల ఆధారంగా ఆర్హత సాధించనున్నాయి.

Read More..

ICC World Cup 2023 schedule : .. హైదరాబాద్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్‌లు కన్ఫమ్

Next Story

Most Viewed