వన్డే వరల్డ్ కప్‌కు సన్నాహాలు.. రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ బహుకరించిన బీసీసీఐ

by Javid Pasha |
వన్డే వరల్డ్ కప్‌కు సన్నాహాలు.. రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ బహుకరించిన బీసీసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే నెల 5వ తేదీ నుంచి భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుండగా.. అన్ని దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగా.. అన్ని దేశాల టీమ్‌లు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ కూడా వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించింది. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగుతుంది. ఇక మరికొంతమంది కీలక ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కలేదు.

అయితే వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడటానికి ఆహ్వానిస్తూ పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు బీసీసీఐ గోల్డెన్ టికెట్లు అందిస్తోంది. ఇప్పటికే సచిన్ టెండూల్కర్‌, అమితాబ్ బచ్చన్‌కు గోల్డెన్ టికెట్లు అందించగా.. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు బీసీసీఐ గోల్డెన్ టికెట్ అందించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా చెన్నైలో రజనీని కలిసి టికెట్‌ను అందించారు. 2011 తర్వాత భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుండటంతో సూపర్ సక్సెస్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకోసం పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తోంది.

ఈ గోల్డెన్ టికెట్ ద్వారా వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లన్ని స్టేడియంలో వీక్షించవచ్చు. వీరి కోసం ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీలో సీటు కేటాయిస్తారు. ప్రముఖ వ్యక్తులకు ఈ గోల్డెన్ టికెట్‌ను బీసీసీఐ బహుకరిస్తుంది. రజనీకాంత్‌కు ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన మ్యాచ్‌లు చూడటానికి రావడం వల్ల వన్డే వరల్డ్ కప్‌కు మరింత క్రేజ్ పెరిగే అవకాశముంది.మరి రజనీకాంత్ వస్తారా? లేదా? అనేది చూడాలి.



Next Story

Most Viewed