WorldCup2023: విశ్వవిజేతగా ఆస్ట్రేలియా.. ఫైనల్లో ఇండియా చిత్తు

by Disha Web Desk 2 |
WorldCup2023: విశ్వవిజేతగా ఆస్ట్రేలియా.. ఫైనల్లో ఇండియా చిత్తు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ వేదికగా జరుగుతోన్న వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. సొంత గడ్డపై టీమిండియాను మట్టి కరిపించింది. భారత్ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 43 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లీ(54), కేఎల్ రాహుల్ (66) మినహా అందరూ నిరాశపరిచారు. కీలక మ్యాచ్‌లో గిల్, శ్రేయాస్, సూర్యకుమార్ వంటి బ్యాట్‌మెన్లు చేతులెత్తేశారు. దీంతో భారత్ 50 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, హేజుల్‌వుడ్ రెండు వికెట్లు, కమిన్స్ రెండు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, జంపా చెరో వికెట్ తీశారు. దీంతో లక్ష్య చేధనలో బ్యాటింగ్ వచ్చిన ఆసీస్ బ్యాటర్లు మొదట తడబడ్డారు. వరుసగా వార్నర్, స్మిత్, మార్ష్ వంటి ముఖ్యమైన మూడు వికెట్లు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో టీమిండియా అభిమానుల్లో కొంత ఆశ చిగురించింది. అయితే, ఆ తర్వాత ఆసీస్ బ్యాటర్లు హెడ్(130), లబుషేన్‌లు(60) అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు. టీమిండియా బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు, షమీ ఒక వికెట్ తీశారు. 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, ఆసీస్ వన్డే వరల్డ్ కప్ గెలవడం ఇది ఆరోసారి కావడం గమనార్హం.



Next Story

Most Viewed