మీకు గుర్తుందా.. నాలుగేండ్ల క్రిందట ఈ రోజే ‘విరాట’పర్వం

by  |
మీకు గుర్తుందా.. నాలుగేండ్ల క్రిందట ఈ రోజే ‘విరాట’పర్వం
X

దిశ, వెబ్‌డెస్క్: విరాట్ కోహ్లీ.. ఆవేశం ఎక్కువే అయినా ఆటతీరు అమోగం. అనతి కాలంలోనే అత్యున్నత శిఖరాలకు చేరిన విరాట్.. ప్రపంచ క్రికెట్‌లో పరుగుల రారాజు(రన్ మెషీన్‌)గా ముద్రవేశాడు. ఇప్పటికే 91 టెస్టు మ్యాచుల్లో 7,490 పరుగులు(27 సెంచరీలు/25 హాఫ్ సెంచరీలు) 254 వన్డే మ్యాచుల్లో 12,169 పరుగులు(43 సెంచరీలు/62 హాఫ్ సెంచరీలు) 90 టీ20 మ్యాచుల్లో 3,159(20 హాఫ్ సెంచరీలు), 199 ఐపీఎల్ మ్యాచుల్లో 6,076 (5 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు)తో రాణిస్తున్నాడు. కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యున్నత స్కోరు వివరాలను పరిశీలిస్తే.. టెస్టు సిరీస్‌లో 254, వన్డే మ్యాచ్‌లో 183, టీ 20లో 94, ఐపీఎల్‌లో 113 పరుగులు సాధించాడు.

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. ఇదే ప్రయాణంలో సరిగ్గా నాలుగేండ్ల క్రిందట విరాట్ అరుదైన రికార్డును సృష్టించాడు. 175 వన్డే మ్యాచుల్లో ఏకంగా 8000 పరుగులు చేసి ఫాస్టెస్ట్ వన్డే క్రికెటర్‌గా రికార్డులోకెక్కాడు. చాంపియన్ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో భాగంగా.. 2017, జూన్ 15వ తేదీన భారత్ vs బంగ్లా మ్యాచ్‌లో.. కోహ్లీ 88 పరుగులు చేయడంతో 8 వేల మైలురాయిని అనతి కాలంలోనే ఛేదించాడు. కోహ్లీ తర్వాత 182 ఇన్నింగ్స్‌లో 8 వేల పరుగులు చేసి ఏబీ డివిలియర్స్ రెండో స్థానంలో ఉండగా.. 3 సౌరవ్ గంగూళీ (200), 4 సచిన్ టెండుల్కర్ (210), 5 బ్రెయిన్ లారా(211) స్థానాల్లో ఉన్నారు. ఈ రికార్డులను గుర్తు చేస్తూ క్రికెట్ అభిమానులు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోహ్లీ ఘనతను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed