160కి పైగా ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు మూతపడే అవకాశం ?

by  |
160కి పైగా ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు మూతపడే అవకాశం ?
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా ప్రైవేట్ కళాశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మహామ్మారి మూలనా విద్యార్థులు పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లి చదుకోవడం అనేదే లేకుండా పోయింది. ఏడాదిన్నరగా ఆన్‌లైన్ క్లాసులే జరుగుతున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గడంతో కళాశాలలు అడ్మిషన్లు ప్రారంభించాయి. ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు కొత్త విద్యార్థులను చేర్చుకోవడానికి, క్లాసులు నిర్వహించడానికి ఏటా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ ఈ సారి చాలా వరకు జూనియర్ కళాశాలలు ప్రభుత్వం అనుమతి తీసుకోలేదు.

గతేడాది 1681 జూనియర్‌ కాలేజీలు అనుమతి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ ఏడాది 1520 కాలేజీలు మాత్రమే దరఖాస్తు పెట్టుకున్నాయి. అంటే 161 కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఆ కళశాలలు మూతపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనుమతి తీసుకున్న చాలా కళాశాలలో కూడా అడ్మిషన్లు జరగక పోయే సరికి ప్రైవేట్ జూనియర్ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదంటున్నారు. ఈ క్రమంలో 160కి పైగా ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు మూతపడే ప్రమాదంలో ఉన్నట్టు అధికారుల అంచనా. అంతే కాకుండా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కరోనా సమయంలో విద్యార్థులు లేక బిల్డింగ్ అద్దెలు కట్టలేక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయాయి. దీంతో వారు మళ్లీ కళాశాలలను తిరిగి ప్రారంభిచడానికి ఆసక్తి చూపడం లేదని కొందరి అభిప్రాయం.

Next Story