‘కరోనాను అరికట్టేందుకు 150 బృందాలు’

by  |
‘కరోనాను అరికట్టేందుకు 150 బృందాలు’
X

దిశ, న్యూస్ బ్యూరో: కోవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు క్షేత్ర‌స్థాయిలో 150 బృందాలు ప‌నిచేస్తున్న‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. శ‌నివారం త‌న కార్యాల‌యంలో క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఇటీవ‌ల‌ విదేశాల నుంచి వ‌చ్చినవారి ఇళ్ల‌ను ప‌రిశీలించి ఆ కుటుంబం ఆరోగ్య స్థితిని పరిక్షీస్తున్నట్లు వివ‌రించారు. ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు విదేశాల నుండి వ‌చ్చిన‌వారు త‌ప్ప‌నిస‌రిగా 14రోజుల పాటు హోమ్ క్వారంటైన్ పాటించాల‌ని తెలిపారు. హోమ్ క్వారంటైన్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మిస్తే ప్ర‌భుత్వం నిర్దేశించిన క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించ‌నున్న‌ట్లు తెలిపారు. విదేశాల నుంచి వ‌చ్చిన‌వారి ఇళ్ల‌కు వెళ్తున్న బృందాలు విదేశాల నుండి వ‌చ్చిన వ్య‌క్తి లేదా వారి కుటుంబ స‌భ్యుల‌లో కోవిడ్‌-19 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే క్షేత్ర‌స్థాయి బృందాలు జీహెచ్ఎంసీలో నెల‌కొల్పిన కంట్రోల్ రూంకు తెలియ‌జేస్తార‌ని వివ‌రించారు.

కోవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టుట‌కై జిహెచ్‌ఎంసి ప‌రిధిలోని హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్‌, సంగారెడ్డి జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్న‌ట్లు కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీలో రెగ్యూలర్ శానిటేష‌న్ ప‌నుల‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తిరోజు 6,200 నుండి 6,400 మెట్రిక్ ట‌న్నుల చెత్త‌ను సేక‌రిస్తున్న‌ట్లు వెల్లడించారు. అయితే కోవిడ్ -19 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన ఇళ్ల చుట్టుప‌క్క‌ల, హోం క్వారంటైన్ జ‌రిగిన ప్రాంతాల‌లో ప్ర‌త్యేక శానిటేష‌న్ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ఐసోలేష‌న్ ఏరియాల్లో కూడా ప్ర‌త్యేక శానిటేష‌న్ డ్రైవ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఎంట‌మాల‌జి, ఇ.వి.డి.ఎం బృందాల‌చే ప్ర‌భుత్వం సూచించిన ర‌సాయ‌నాల‌ను స్ప్రేయింగ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనల మేరకు 22వ తేదీ ఉద‌యం 6గంట‌ల నుంచి 23వ తేదీ ఉద‌యం 6గంట‌ల వ‌ర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూను పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

Tags: ghmc Commissioner, Lokesh Kumar, comments, 150 teams, prevent corona

Next Story

Most Viewed