వచ్చే ఏడాది నుంచి దుస్తులు, పాదరక్షలపై 12 శాతం జీఎస్టీ!

by  |
bussiness
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) వివిధ రకాల టెక్స్‌టైల్స్, పాదరక్షలపై జీఎస్టీ 5 శాతం నుంచి 12 శాతానికి పెంపు నిర్ణయాన్ని నోటిఫై చేసింది. ఇది 2022, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. సింథటిక్ ఫైబర్స్, నూలుపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం టెక్స్‌టైల్స్ రంగానికి ఒకే విధమైన రేట్లను తీసుకురావడమే కాకుండా ఇన్వర్టెడ్ సుంకం విధానంలో సవాళ్లను తొలగించడానికి వీలవుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాదరక్షలు, టెక్స్‌టైల్స్‌పై ఇన్వర్టెడ్ సుంకాన్ని సరిచేయాలని నిర్ణయించారు.

ఆ సమయంలో ఎంత మేరకు జీఎస్టీ తగ్గింపు ఉంటుందనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి అన్ని రకాల దుస్తులపై జీఎస్టీ 12 శాతం అమలు కానుంది. ఇప్పటివరకు రూ. వెయ్యి వరకు దుస్తులపై 5 శాతం జీఎస్టీనే విధించబడుతోంది. అలాగే, పాదరక్షలపై వచ్చే ఏడాది నుంచి 12 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం రూ. వెయ్యి విలువైన వాటిపై కూడా 5 శాతం జీఎస్టీ ఉంది. ఈ రేట్ల మార్పు పరిశ్రమలకు కలిసొస్తాయని, ఇన్వర్టెడ్ సుంకాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Next Story

Most Viewed