టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్.. పాఠశాలల్లో చక్కర్లు

by  |
టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్..  పాఠశాలల్లో చక్కర్లు
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పాఠశాలల యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుతోంది. వివరాల్లోకి వెళ్లితే…రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం పాఠశాలలో జరగాల్సిన పదో తరగతి SA-I హిందీ పరీక్షను మండలంలోని పాఠశాలల యాజమాన్యం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తుంది. సోమవారం హిందీ SA-I పరీక్ష జరగాల్సిన ప్రశ్నపత్రం మండలంలో ముందుగానే లీక్ కావడం సంచనలంగా మారింది. వెలుగులు నింపాల్సిన పాఠశాలలే ఈలాంటి దౌర్భాగ్యస్థితిలో ఉన్నందుకు తోటి పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జరిగే హిందీ ప్రశ్న పత్రం లీక్ అవ్వడం దుర్మార్గమైన చర్యని విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి.

కొన్ని నెలల పాటు కష్టపడి చదివిన విద్యను కొంతమంది పాఠశాలల సిబ్బంది వల్ల ప్రశ్నపత్రం లీక్ కావడంతో విద్యార్థుల భవిష్యత్ మనుగడ కోల్పోతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హిందీ ప్రశ్నపత్రం ఏవిధంగా లీక్ అయ్యిందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ముందుగానే ప్రశ్నపత్రం లీక్ చేసిన పాఠశాలపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మండల ఎడ్యుకేషన్ అధికారి వీరస్వామి వివరణ…

సోమవారం పదో తరగతి విద్యార్థులకు జరగబోయే SA-I హిందీ పరీక్ష ప్రశ్నపత్రం
గురించి దిశ విలేకరి మండల ఎడ్యుకేషన్ అధికారి వీరస్వామిని వివరణ కోరగా హిందీ పేపర్ లీక్ అయ్యింది..కదా..పేపర్ లో వేయండి సార్ అని సమాధానం ఇచ్చారు. ఏ పాఠశాల లీక్ చేశారో తెలుసుకొని ఆపాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. ఏ పాఠశాల అయినా సరే వదిలే సమస్యలేదని వివరించారు.



Next Story

Most Viewed