వారిని భయపెడుతున్న డెంగ్యూ.. 6 సంవత్సరాల బాలుడు మృతి

by  |
వారిని భయపెడుతున్న డెంగ్యూ.. 6 సంవత్సరాల బాలుడు మృతి
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ గ్రామంలో డెంగ్యూ విజృంభిస్తోంది. గ్రామంలో ఇప్పటికే సుమారుగా 20 మంది వరకు డెంగ్యూ బారిన పడినట్టుగా గ్రామస్థులు తెలిపారు. రోజురోజుకు గ్రామంలో డెంగ్యూ విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్ గ్రామంలో 6 సంవత్సరాల వయస్సు గల రుషి అనే బాలుడు డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత పది రోజుల క్రితం రుషి తీవ్ర అస్వస్థతకు గురి కాగా కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ జ్వరం తగ్గక పోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గత పది రోజులుగా రుషి చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న రుషి సోమవారం ఆస్పత్రిలో మృతి చెందాడు. బాలుని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed