పెళ్లిలో వధువును గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తున్న మాజీ ప్రియుడు! వరుడు ఏం చేశాడంటే! (వీడియో)

by Disha Web Desk 7 |
పెళ్లిలో వధువును గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తున్న మాజీ ప్రియుడు! వరుడు ఏం చేశాడంటే! (వీడియో)
X

దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి పందిరిలో ఏ చిన్న ఈవెంట్ జరిగిన అది నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటోంది. అయితే.. కొన్ని వీడియోలు నెట్టింట నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రతి పెళ్లిలో అప్పగింతలు చాలా కామన్. పెళ్లి సంబరం మొత్తం పూర్తయిన తర్వాత ఆడపిల్లను అప్పగించేటప్పుడు తల్లిదండ్రులు , బంధువులు ఏడుస్తారు. ఈ క్రమంలోనే పెళ్లి ఫంక్షన్‌లో ఓ వ్యక్తి చేసిన పని చాలా వింతగా అనిపించింది. వధువు, వరుడు రిసెప్షన్‌లో కూర్చుని ఉండగా.. ఆ వ్యక్తి వధువును వెనుక నుంచి గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ వధువు కూడా ఏడుస్తుంది కానీ అదే సమయంలో కాస్త ఇబ్బందికి కూడా గురైంది. వరుడు మాత్రం అలా చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘ఆ వ్యక్తి తాగి ఉన్నాడు’ అని ‘మాజీ లవర్ అనుకుంటా’ అని ‘తప్పుగా చూడకండి ఆయన వధువు బ్రదర్ అయుంటాడు’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed