భారీ శుభవార్త: జూలై నుంచి ఖాతాల్లో నెలకి రూ.8,500.. ఈ హామీ ఎవరికంటే?

by Anjali |
భారీ శుభవార్త: జూలై నుంచి ఖాతాల్లో నెలకి రూ.8,500.. ఈ హామీ ఎవరికంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో నగదు బదిలీ పథకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు హామీల వర్షం కురిపిస్తోన్న విసయం తెలిసిందే. కాగా ఈ హామీలను కాస్త సమయం పట్టినా ప్రజలకు లబ్ది చేకురుస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా మరో హామీ తెర మీదకు వచ్చింది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఈ ఏడాది జులై నుంచి మహిళల ఖాతాల్లో 8, 500 రూపాయలు జమ చేస్తామని ప్రియాంక గాంధీ చెప్పుకొచ్చారు. జులై నుంచి ప్రతి మహిళ అకౌంట్ లో రూ. 8500 అనగా.. ఏడాదికి ఖాతాలో ఎక్కువ మొత్తం లక్ష జమ చేస్తామని.. దీంతో ప్రతి కుటుంబం ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని వెల్లడించారు. అలాగే ఆశా, అంగన్‌వాడీ, కిచెన్‌ హెల్పర్‌ల గౌరవ వేతనానికి సంబంధించి కూడా కేంద్రం సహకారం రెట్టింపు కానుందని తెలిపారు. రూ. 25 లక్షల బీమా పథకం మిమ్మల్ని వైద్య ఖర్చుల బారి నుంచి తప్పిస్తుందని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు

Next Story

Most Viewed