తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పత్తా లేకుండా పోయింది : చామల

by Disha Web Desk 23 |
తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పత్తా లేకుండా పోయింది : చామల
X

దిశ,నర్మెట్ట : మండలంలోని కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నర్మెట్ట మండలంలోని గ్రోమోర్ నుంచి చౌరస్తా వరకు ఆటపాటలతో డప్పు వాయిద్యాలతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. చౌరస్తాలో కార్నర్ మీటింగ్ సభలో చామల కిరణ్ ,రాజగోపాల్ రెడ్డి,బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వం బీఆర్ఎస్ దుర్మార్గమైన పరిపాలనకు ప్రజలు చరమ గీతం పాడారని, తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పత్తా లేకుండా పోయిందని అన్నారు.గుజరాత్ ప్రజలకు మంచి చేసి, మన బ్రతుకులు మారుస్తా అని చెప్తున్న మోడీ మనకు అవసరమా అని, దొంగ ఓట్లతో గెలిచిన జనగామ నియోజకవర్గ పల్లా రాజేశ్వర్ రెడ్డి మనకు అవసరమా అని, మీ ఓట్లతో సమాధానం చెప్పాలి అని అన్నారు.

ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు సాగాలని మనం ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉన్నామని మీకు సర్పంచ్,జడ్పీటీసీలు మీరు అయ్యేటట్లు నేను సహకారాన్ని అందిస్తానని తెలిపారు. రాజగోపాల్ మాట్లాడుతూ సచ్చిన పాము లాంటిది బీ ఆర్ఎస్ పార్టీ అని, రాజీ లేని రాజకీయ నాయకుడిగా మీ ముందుకు వచ్చిన ,తెలంగాణ బిల్లు తెచ్చిన ఘనత నాది అని, మీకోసం మేము మన కాంగ్రెస్ కోసం మీరు అంటూ ధైర్యాన్ని నింపి ఉత్తేజపరిచారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారెంటీలను వివరిస్తూ ప్రజల్లో దూసుకుపోవాలని ఈ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ ఇస్తున్నారని అదే స్ట్రాటజీ తో ముందుకు సాగాలి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగం నర్సింహారెడ్డి ,మాజీ ఎమ్మెల్యే రాజలింగం,నర్మెట్ట మండల అధ్యక్షుడు రాజబోయిన లక్ష్మీ నారాయణ, జిల్లా మహిళ అధ్యక్షులు బడికె ఇందిరా, గాదె మోహన్ రెడ్డి,గొల్లపల్లి కుమారస్వామి, పరిదుల యాదయ్య, చెవుల పరుశరాములు, కళ్యాణం మురళి, భూక్య జయరాం తదితరులు కాంగ్రెస్ ముఖ్య నాయకులు,మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed