మమ్మల్ని చంపేందుకు వంద మంది.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by Rajesh |
మమ్మల్ని చంపేందుకు వంద మంది.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయారు. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్డులో సర్వే నంబర్ 81,82లో ఎమ్మెల్యేకు చెందిన 2ఎకరాల 10 గుంటల స్థలం కబ్జా చేస్తున్నారని స్పాట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. వంద మంది గుండాలు తమను చంపేందుకు వచ్చారని.. గంట ముందే తాను ఇన్ఫామ్ చేసిన యాక్షన్స్ తీసుకోలేదని పోలీసులపై ఫైర్ అయ్యారు. తన అనుచరులకు రేకుల ఫెన్సింగ్ కూల్చేయాలని ఆదేశించారు. వాగ్వాదం సమయంలో మల్లారెడ్డితో పాటే ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి పోలీసులతో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Click Here For Twitter Post..

Next Story