ఎక్సైజ్ కమిషనర్‌పై వెంటనే చర్యలు తీసుకోండి: ఈసీకి ఫిర్యాదు చేసిన ఫోరమ్ ఫర్ డెమొక్రటిక్ తెలంగాణ

by Disha Web Desk 1 |
ఎక్సైజ్ కమిషనర్‌పై వెంటనే చర్యలు తీసుకోండి: ఈసీకి ఫిర్యాదు చేసిన ఫోరమ్ ఫర్ డెమొక్రటిక్ తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల్లో అక్రమాలకు అవకాశం ఇచ్చే విధంగా ఎక్సైజ్ శాఖలో దాదాపు 23 మంది ఎస్‌హెచ్‌వో, డీటీఎఫ్‌తో పాటు ఎస్ఐ నుంచి డీసీ స్థాయి వరకు బదిలీ అయిన ఎక్సైజ్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫోరమ్ ఫర్ డెమొక్రటిక్ తెలంగాణ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా వున్నా శ్రీనివాస్ గౌడ్ దాదాపు ఏడుగురు అధికారులను మంత్రి కేటీఆర్‌కు సిఫారసు చేసిన వారు కుడా ఉన్నారని పేర్కొన్నారు. వీరందరూ ఒకే పార్లమెంట్ సెగ్మెంట్లో మూడేళ్లకు పైబడి విధులు నిర్వహించిన తిరిగి అదే సెగ్మెంట్లో పోస్టింగ్స్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నపటికీ ఇలా పోస్టింగులు ఇవ్వడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని అన్నారు. ఎన్నికలో డబ్బు, మద్యం, పంపిణీ అరికట్టేందుకు ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరగాలని ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్టంలోని ఎక్సైజ్ శాఖలో బదిలీలు చేపట్టాలని ఆదేశించిన ఎక్సైజ్ కమిషనర్ నామమాత్రంగా బదిలీలు చెప్పట్టారని తెలిపారు. గత ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసి మద్యం డంపులకు సహకరించి నాయకుల గెలుపుకు పూర్తి స్థాయిలో సహకరించారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ఎక్సైజ్ కమిషనర్‌పై రాష్ట్ర ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని కోరారు.



Next Story

Most Viewed