- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జీవితం పర్‌ఫెక్ట్‌గా లేదంటూ నరేష్ ఆసక్తికర ట్వీట్.. పవిత్ర లోకేష్‌తో గొడవలే కారణమా?
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పలు చిత్రాల్లో హీరోగా, కమెడియన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తండ్రి పాత్రలు కూడా చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా నరేష్ తన పర్సనల్ లైఫ్ పరంగా ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నాడు. భార్య ఉండగానే నటి పవిత్రా లోకేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో నెట్టింట చర్చానియాంశమైంది. అంతేకాకుండా వీరిద్దరు ముద్దులు పెట్టుకున్న వీడియోలు బయటకు రావడంతో ఈ వయస్సులో అవసరమా అంటూ నెటిజన్లు నరేష్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
అయినప్పటికీ ఆయన అవన్నీ పట్టించుకోకుండా పవిత్రా లోకేష్‌తో హనీమూన్‌కు కూడా వెళ్లాడు. యంగ్ కపుల్స్ లాగా పలు చోట్ల తిరిగి ఫుల్ ఎంజాయ్ చేశారు. అలాగే ఓ సినిమా కూడా చేసి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసే ఉంటున్నారు. అయితే నరేష్ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ సోషల్ మీడియాకు కాస్త దూరం అయ్యాడు. ఈ క్రమంలో.. తాజాగా, నరేష్ తన ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఎండ తీవ్రత చాలా ఉందంటూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ‘‘అనేక ప్రాంతాల్లో ఎండ వేడి అధికంగా ఉంది. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటుతోంది.
అంతేకాదు ఈ ఎండ వేడికి క్యారవాన్‌లోని ఏసీలు కూడా పనిచేయడం లేదు. కొన్ని మూవీ యూనిట్‌లు ఎండ వేడిని తట్టుకోలేక షూటింగ్‌లను రద్దు చేసుకున్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి మిత్రులారా.. రాబోయే కొద్ది రోజులు మరింత దారుణంగా ఉంటాయి. కావున పని ఉంటేనే తప్ప బయటకు వెళ్ళవద్దు. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి’’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే జీవితం పర్‌ఫెక్ట్‌గా లేదు. అయినప్పటికీ మీరు పర్‌ఫెక్ట్ మూమెంట్స్‌తో నింపండి అని చెప్తూ ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం నరేష్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన వారంతా ఎందుకు నీ భార్య పవిత్ర లోకేష్‌తో లైఫ్ బాలేదా గొడవలు జరిగాయా? అంటూ పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
. Heat wave is on .temperatures crossing 45 in many areas. Ac’s in the caravans failing . some film units of cancelling shoots, unable to withstand heat. be cautious friends for the next few days do not venture out unless there is an work. Take care. keep yourself hydrated. pic.twitter.com/Qq8aHXR2PB
— H.E AMB LTCOL SIR Naresh VK actor (@ItsActorNaresh) May 4, 2024