బూర నర్సయ్య గౌడ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలి : చామల కిరణ్ కుమార్ రెడ్డి

by Disha Web Desk 11 |
బూర నర్సయ్య గౌడ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలి : చామల కిరణ్ కుమార్ రెడ్డి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి పార్లమెంట్ బరిలో బీజేపీ పార్టీ సర్వేలో మూడవ స్థానంలో ఉందని, దీంతో ఆ పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తనపై చిల్లర ఆరోపణలు చేస్తున్నాడని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం భువనగిరిలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బూర నర్సయ్య గౌడ్ ఒకసారి ఎంపీగా చేసిన వ్యక్తి అని అలాంటి వ్యక్తి ఎదుటి వ్యక్తి పై ఆరోపణలు చేసేటప్పుడు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.‌ ఐదేళ్లు భువనగిరికి ఎంపీగా అభివృద్ధిపై ఏ ఒక్కరోజైనా ప్రధాని మోడీని కలిశావా అని ప్రశ్నించారు.

భువనగిరి ఎంపీగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేక మార్లు ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులు నితిన్ గట్కరి, వికేసింగ్, పీయూష్ గోయలతో పాటు మరికొంత మందిని కలిసి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశాడన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాగునీటి కాలువల కోసం సొంత నిధులు వెచ్చించినట్లు చెప్పారు. అట్లాంటి వ్యక్తులను విమర్శించడం సరికాదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాలుగా కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినట్లు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా పనిచేశానని, మరి తాను ఫోర్జరీ చేస్తే రాహుల్ గాంధీ బీఫామ్ ఇస్తాడా అని విమర్శించారు. బూర నర్సయ్య గౌడ్ పాత పార్టీ బుద్దులు, కొత్త పార్టీల్లో చూపిస్తున్నడని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ డాక్టర్స్ జేఏసీ తరఫున బూర నర్సయ్య గౌడ్ ను తీసుకురాకపోతే నేడు ఆయన ఎవరికి తెలుసు అని ప్రశ్నించారు .సీఎం కేసీఆర్ కు గతంలో అత్యంత సన్నిహితుడైన బూర భువనగిరికి ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నించారు.‌ 9 వేలకోట్లతో ఏదో అభివృద్ధి చేశానని చెప్పుకొనే బూర నర్సయ్య వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కలు చూపించాలన్నారు. ఒక బీసీ నాయకుడిగా చెప్పుకునే బూర నర్సయ్య తను ఆసుపత్రులు పెట్టినప్పుడు ఎంతమందికి ఉచితంగా వైద్యం, ఎంతమందికి సర్జరీలు చేశాడో ఆలోచించుకోవాలన్నారు. 2014 విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఎయిమ్స్ వచ్చిందని, ఐదు ఏళ్ళు ఎంపీగా ఉండి ఎయిమ్స్ ను ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు‌.

తనకంటూ ఏడుగురు ఎమ్మెల్యేలు గెలుపు కోసం పనిచేస్తున్నారని, మరి నీ వెనుకాల ఎవరు ఉన్నారో చూసుకోవాలన్నారు.‌ పసుమముల గ్రామంలో 106 సర్వే నంబర్ లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ లకు ఇచ్చిన ఏడు ఎకరాలపై ఎన్వోసీ తెచ్చి వేరే వాళ్లకు కట్టబెట్టినట్లు ఆరోపించారు. బూర నర్సయ్య గౌడ్ తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నాడని, గెలిస్తే ఏం చేస్తావో ప్రజలకు చెప్పాల్సింది పోయి అర్థంపర్థం లేని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. కేసీఆర్ లక్ష యాభై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టాడని, మరి ఒక 350 కోట్లు తెచ్చి భువనగిరి పార్లమెంట్ లో సాగునీటి కోసం ఎందుకు తీసుకురాలేకపోయావన్నారు. ఫోర్జరీ సంతకం గురించి మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర, బీఆర్ఎస్ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తస్మాత్ జాగ్రత అని, ఆలోచించి మాట్లాడాలని సూచించారు.‌ సీఎం రేవంత్ రెడ్డి దేవుడు సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తానన్నాడని, తప్పకుండా చేసి చూపిస్తామన్నారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రే కాదని, పీసీసీ అధ్యక్షుడు కూడానని, ఎమ్మెల్యే తో, ఎంపీ ల అందరికీ సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉంటున్నట్లు చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినా బీజేపీ, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. దేశానికి పదేళ్లు పెద్దన్నగా ఉన్న మోదీ, తెలంగాణకు ఎం ఇచ్చారన్నారు.‌ కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్ము కాజేస్తే, ప్రధాని మోదీ ఏం చేశాడన్నారు. కేసీఆర్ తెలంగాణకు నిధులు కావాలని ప్రధాని మోదీని అడిగిన దాఖలు లేవన్నారు.

భువనగిరి బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్దులు ఇద్దరు ప్యారాషూట్ లీటర్లు అన్నారు. వ్యక్తిగతంగా తనను డ్యామేజ్ చేసే కుట్రలు చేస్తున్నారని ఇకమీద ఇలా చేస్తే సహించబోను అన్నారు. ఎయిమ్స్ రాకుండా అడ్డుకునేందుకు బూర నర్సయ్య గౌడ్ కుట్రలు చేశాడని విమర్శించారు. రష్యా ,చైనా దేశాలుగా ప్రధాని, మంత్రులు రాజ్యాంగం మార్చి పర్మినెంట్ ప్రధానమంత్రి ఉండాలని మోడీ చూస్తున్నాడని చెప్పారు.‌ ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పొతంశెట్టి వెంకటేశ్వర్లు, టీపీసీసీ నాయకులు తంగెళ్లపల్లి రవికుమార్, రామ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ లక్ష్మి, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed