బండమీది చందుపట్ల ఫీల్డ్ అసిస్టెంట్ పై గ్రామస్థుల తిరుగుబాటు....

by Disha Web Desk 11 |
బండమీది చందుపట్ల ఫీల్డ్ అసిస్టెంట్ పై గ్రామస్థుల తిరుగుబాటు....
X

దిశ, చివ్వెంల : చివ్వెంల మండల పరిధిలోని బండమీద చందుపట్ల గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గుయ్యం రవిపై గ్రామస్తులు శుక్రవారం తిరుగుబాటు చేశారు. 600 మందికి పైగా కూలీలు ఉన్న గ్రామంలో కావాలని తనకు అనుకూలంగా ఉన్న ముగ్గురు మెట్ల సహాయంతో నిత్యం పెట్టిన వారికి పని పెడుతూ మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. 300 మంది కూలీలకు ఉపాధి హామీ పని కల్పించకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ గుయ్యం రవి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు.

నేను చెప్పిన రోజే పనికిరావాలని హుకుం జారీ చేస్తున్నాడని వారు తెలిపారు. నచ్చినవారిని మేట్లుగా నియమించుకొని ఉపాధి హామీ పనికి రాకున్నా 50 మందికి పై కూలీలకు నిత్యం హాజర్లు వేస్తూ వారి వద్ద నుండి కొంత నగదు తీసుకొని అవినీతికి పాల్పడుతున్నాడని అన్నారు. ఉపాధి హామీ పనులు మా గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన అవినీతిపై బహిరంగ విచారణ చేసి అతన్ని సస్పెండ్ చేయడమే కాకుండా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ కార్యదర్శి చలమయ్య, ఏపీవో నాగయ్య లు ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వచ్చి వారికి నచ్చజెప్పారు. వారిని ఉపాధి హామీ పనికి వెళ్లాలని అదేశించి, పని చేసిన వారికి హాజరు నమోదు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed